రేపు అమరావతికి రానున్న జనసేనాని.. మంగళగిరి కార్యాలయంలో పార్టీ సమీక్షలు

  • మధ్యాహ్నం పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో భేటీ
  • సమావేశానికి తప్పక హాజరుకావాలని నాయకులకు సమాచారం
  • సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం
సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి ఎదురైన పరాభవంపై నాయకులు, ముఖ్య కార్యకర్తలతో చర్చించేందుకు రేపు జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అమరావతి వస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో పార్టీ ఓటమికి గల కారణాలపై సమీక్షించనున్నారు. ఇందుకు సంబంధించి సమావేశానికి హాజరు కావాల్సిన నేతలకు, కార్యకర్తలకు ఇప్పటికే సమాచారం పంపారు. ముఖ్యులు తప్పక సమావేశానికి హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.

కాగా, రేపు ఉదయం 9.30 గంటలకు పవన్‌ కల్యాణ్‌ గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి పడమటలంకలోని తన నివాసానికి  వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకుని పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. ఈ సమావేశం అనంతరం పవన్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
amaravathi
party meeting
tommorow

More Telugu News